గ్రూప్‌ –2 ఫలితాల్లో సత్తా | - | Sakshi
Sakshi News home page

గ్రూప్‌ –2 ఫలితాల్లో సత్తా

Sep 30 2025 9:07 AM | Updated on Sep 30 2025 9:07 AM

గ్రూప

గ్రూప్‌ –2 ఫలితాల్లో సత్తా

దోమ: గ్రూప్‌ –2 ఫలితాల్లో మండలం నుంచి ఇద్దరు అభ్యర్థులు సత్తాచాటారు. చట్లచందారం గ్రామానికి చెందిన వార్ల వెంకటయ్య కుమార్తె వార్ల సుష్మ అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (ఏఎస్‌ఓ)గా నియమితులయ్యారు. మల్లేపల్లి తండాకు చెందిన విస్లావత్‌ గణేశ్‌ ఎకై ్సజ్‌ ఎస్సై ఉద్యోగం సాధించారు. వీరిని ఆయా గ్రామాల ప్రజలు అభినందించారు.

బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్‌

కార్పెంటర్‌ దుర్మరణం

షాద్‌నగర్‌రూరల్‌: టిప్పర్‌ ఢీకొని కార్పెంటర్‌ మృతి చెందిన ఘటన పట్టణంలోని పాతజాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ శరత్‌కుమార్‌ తెలిపిన ప్రకారం.. పట్టణంలోని టీచర్స్‌ కాలనీలో నివాసం ఉంటున్న శివశంకర్‌(33) ఈశ్వర్‌కాలనీలో కార్పెంటర్‌ షాపు నడుపుతున్నాడు. ఆదివారం అర్ధరాత్రి తన షాపు మూసి బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో మహబూబ్‌నగర్‌ రోడ్డులోని యమ్మీ బేకరీ ఎదురుగా ఉన్న దుకాణానికి వెళ్లి రోడ్డుపైకి వస్తుండగా టిప్పర్‌ వెనుక నుంచి వేగంగా వచ్చి బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శివశంకర్‌ తలకు తీవ్ర గాయాలై కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడి వివరాలను తెలుసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు టిప్పర్‌ను పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మృతుడి సోదరుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

రెచ్చిపోయిన చైన్‌ స్నాచర్‌

వృద్ధురాలి మెడలోంచి పుస్తెలతాడు చోరీ

ఇబ్రహీంపట్నం రూరల్‌: ఆదిబట్ల ఠాణా పరిధిలో సోమవారం ఓ చైన్‌ స్నాచర్‌ చేతివాటం ప్రదర్శించాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. రాగన్నగూడ శోభానగర్‌లో నివాసం ఉండే దాశరథి చెన్నమ్మ(60) ఎన్టీఆర్‌ నగర్‌లో కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తుంది. ఉదయం చెన్నమ్మ రాగన్నగూడ సబ్‌స్టేషన్‌ సమీపంలో కూరగాయలు పట్టుకుని నడుచుకుంటూ బస్టాండ్‌కు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వెనకాల నుంచి వచ్చి ఆమె మెడలో ఉన్న మూడు తులాల మంగళసూత్రం లాక్కుని పారిపోయాడు.

గ్రూప్‌ –2 ఫలితాల్లో సత్తా 1
1/1

గ్రూప్‌ –2 ఫలితాల్లో సత్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement