
అలుగుపారి.. వంతెన దెబ్బతిని
ధారూరు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కోట్‌పల్లి ప్రాజెక్టు అలుగు పారడంతో రుద్రారం–నాగసమందర్ గ్రామాల మధ్యనున్న వంతెన పాక్షికంగా కొట్టుకుపోయింది. వరద ఉధృతి తగ్గడంతో దెబ్బతిన్న బ్రిడ్జి సోమవారం బయటపడింది. ఇరు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. 2016లో ఈ వంతెన వరదనీటి ప్రవాహానికి కొట్టుకపోగా రూ.50 లక్షలతో తాత్కాలికంగా నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం రాకపోకలు స్తంభించడంతో రెండువైపులా నుంచి రావడానికి 10 కిలోమీటర్లకు బదులుగా 60 కిలోమీటర్ల దూరభారం అవుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.