
ఎకరాకు రూ.50 వేలు చెల్లించాలి
బంట్వారం: పంట నష్ట పరిహారం ఎకరాకు రూ.50 వేలు చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన బంట్వారం, కోట్‌పల్లి మండలాల్లో పర్యటించి భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి నష్టం అంచనాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందే వరకు అండగా నిలుస్తామన్నారు. వాగుల చుట్టూ ఉన్న పంట పొలాలన్ని పూర్తిగా నీట మునిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భూమి కోతకు గురియై పొలాలు సైతం కొట్టుకుపోయాయన్నారు. అలాగే దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. అనంతరం ఎన్నారంలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. 22 నెలల పాలనలో కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రజలకు పంచారు. ఆరు గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్ నాయకులు ఓట్లకు వస్తే నిలదీయాలన్నారు. అనంతరం జిన్నారంలో బతుకమ్మ సంబరాల్లో పాల్లొన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సుందరి అనిల్, మల్లేశం, నాయకులు రాములు, వెంకటేష్‌యాదవ్, బల్వంత్‌రెడ్డి, దశరథ్‌గౌడ్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే ఆనంద్