
బీపీ నియంత్రణతో గుండెపోటుకు చెక్
తాండూరు: రక్తపోటు నియంత్రణతోనే గుండెపోటు నివారించవచ్చని ఇండియన్ మెడికల్ అసోషియేషన్(ఐఎంఏ) జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జయప్రసాద్ అన్నారు. ఆదివారం ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా లయన్స్‌క్లబ్ ఽఆధ్వర్యంలో రన్ ఫర్ హెల్దీ హర్ట్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌక్ నుంచి సాయితరుణ్ ఆస్పత్రి వరకు నడిచారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో హృద్రోగ సమస్యలు,. నివారణ చర్యలపై డాక్టర్ జయప్రసాద్ అవగహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ చైర్మన్ బస్వరాజ్, కార్యదర్శి గౌరీశంకర్, మాజీ కౌన్సిలర్ సోమశేఖర్, నాయకులు తదితరులున్నారు.
ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జయప్రసాద్