
పంట రుణాల మాఫీకి నిర్ణయం
ఏకగ్రీవ తీర్మానం చేసిన నావంద్గీ సొసైటీ పాలకవర్గం పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం చైర్మన్ వెంకట్‌రామ్‌రెడ్డి
బషీరాబాద్: భారీ వర్షాలకు పూర్తిగా పంటలు కోల్పోయిన రైతులకు అండగా ఉంటామని నావంద్గీ సొసైటీ చైర్మన్ వెంకట్‌రామ్‌రెడ్డి అన్నారు. సోమవారం సొసైటీ కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశంలో నిర్వహించారు. కాగ్నా నది వరదల కారణంగా పంటలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. బాధిత రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని పాలకవర్గం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపనున్నట్లు చెప్పారు. మండలంలో 1,117 మంది రైతులు సుమారు రూ.6.5 కోట్ల పంట రుణాలు తీసుకున్నారని వాటిని మాఫీ చేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. మండలంలోని రైతులకు సేవాభావంతో యూరియా సరఫరా చేశామన్నారు. సొసైటీకి లాభం లేకున్నా యూరియా అందించామన్నారు. అందరి సహకారంతో సొసైటీ ఆర్థిక అభివృద్ధికి, అనేక వాణిజ్య వ్యాపారాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డైరెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, రంగారెడ్డి, తోట గోపాల్, హన్మంత్‌రెడ్డి, సీఈఓ వెంకటయ్య, రైతులు పాల్గొన్నారు.