
రాకపోకలకు బ్రేక్
దుర్గామాత పూజకు ట్రాక్టర్‌లో వాగుదాటించిన పాలేపల్లి వాసులు
దోమ: రెండు రోజులుగా కురుస్తున్న వర్షం కార ణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నా యి. శనివారం గొడుగునిపల్లి వాగు ఉధృతికి పరిగి–మహబూబ్‌నగర్ మార్గంలో రాకపోకలు నిలిచాయి. పాలేపల్లి వాగు ఉప్పొంగి ఎక్కడి వా హనాలు అక్కడే ఆగిపోయాయి. దుర్గామాత పూజకోసం పూజారి ట్రాక్టర్ సాయంతో వాగుదాటించారు. బ్రహ్మణపల్లి వాగు సైతం హైలెవల్ వంతెనపై పారుతూ జనజీవనం స్తంభించింది.
27 ఏళ్లకు అలుగు పారిన అయినప్పుడు చెరువు
మండల పరిధిలోని అయినప్పుడు గ్రామ పెద్ద చెరువు 27 ఏళ్ల తర్వాత మత్తడి దూకింది. సుమారు 600 ఎకరాల ఆయకట్టు ఉండగా రైతులు సంతోషం వ్యక్తం చేశారు. దాదాపు 200 ఎకరాల పంట పొలాలు నీటి పాలయ్యాయి. గొడుగోనిపల్లిలో బి.రాములమ్మ ఇంటి గోడ కూలి తిమ్మని సత్తయ్య బైక్ పడింది. దీంతో ద్విచక్రవాహనం పూర్తిగా ధ్వంసమైంది.