
తెగిన బ్రిడ్జి.. కూలిన ఇళ్లు
యాలాల: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. కాగ్నా ఉధృతికి మండలంలోని కోకట్ కాగ్నా బ్రిడ్జి తెగింది. దీంతో తాండూరు–రాస్నం, ముద్దాయిపేట మీదుగా పరిగి, హైదరాబాద్ ప్రాంతాలకు రాకపోకలు నిలిచాయి. శివసాగర్, జుంటుపల్లి ప్రాజెక్టులు అలుగులు పారాయి. బెన్నూరుకు చెందిన తిమ్మయ్య, రాస్నంకు చెందిన మల్లేషం ఇళ్లు కూలాయి.
కోకట్ బ్రిడ్జిని పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే
వరద ఉధృతికి తెగిన కోకట్ కాగ్నా బ్రిడ్జిని కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, తహసీల్దార్ వెంకటస్వామి, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తదితరులు పరిశీలించారు. ఈ మార్గంలో రాకపోకలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. యుద్ద ప్రాతిపదికన బ్రిడ్జికి మరమ్మతులకు చర్యలు తీసుకుంటామన్నారు.