
డాక్టర్ వినయ్‌కుమార్‌కు జిల్లా ఆస్పత్రి బాధ్యతలు
తాండూరు: తాండూ రు పట్టణంలోని ప్రభు త్వ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ వినయ్‌కుమార్ నియమితులయ్యారు. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి గర్భిణి మృతికి కారణమైన సూపరింటెండెంట్ సునీతపై వేటు వేసిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో వినయ్‌కుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
శిథిలావస్థ
ఇళ్లను గుర్తించండి
మున్సిపల్ కమిషనర్ యాదగిరి
తాండూరు టౌన్: పట్టణ పరిధిలో శిథిలావస్థకు చేరిన ఇళ్లను గుర్తించాలని మున్సిపల్ కమిషనర్ యాదగిరి సూచించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో సిబ్బందితో సమావేశమయ్యారు. భారీ వర్షాలు కురుస్తున్నందున పాత ఇళ్లు, శిథిలావస్థకు చేరిన ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. వార్డుల వారీగా ప్రమాదకర ఇళ్లను గుర్తించాలన్నారు. వాటిని తొలగిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదన్నారు. అలాగే జనావాసాల మధ్య చెత్తాచెదారం వేయకుండా చూడాలన్నారు. మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలన్నారు. సమావేశంలో డీఈ మణిపాల్, మేనేజర్ నరేందర్ రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఉమేష్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు.
చెరుకు ఫ్యాక్టరీ
ఏర్పాటుకు కృషి
తాండూరు రూరల్: తట్టెపల్లి ప్రాంతంలో చెరు కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేస్తామని పీఏసీఎస్ చైర్మన్ లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం సొ సైటీ కార్యాలయంలో సీఈఓ చంద్రమౌళి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్దేము ల్ మండలంలోని తట్టెపల్లి, బుద్దారం,గాజీపూ ర్, పెద్దేముల్ గ్రామాల్లో రెండు వేల ఎకరాల్లో రైతులు చెరుకు పంట సాగు చేస్తున్నారని తెలి పారు. నాబార్డు నిధులతో పరిశ్రమను నెలకొల్పుతామని పేర్కొన్నారు. ఇందు కోసం ఎకరా భూమి కేటాయించాలని కలెక్టర్‌ను కోరనున్నట్లు తెలిపారు. సొసైటీ పాలకవర్గం సభ్యులు ఉప్పరి మల్లేశం, హన్మంత్, రహీం, శంకర్, శ్రీరాం, దిగంబరం, సుక్కమ్మ పాల్గొన్నారు.
ఉద్యోగాలు భర్తీ చేయండి
అనంతగిరి: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో డిమండ్ చేశారు. ఏడాదిలోగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మాట తప్పిందన్నారు. అసెంబ్లీ వేదికగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసినా ఎలాంటి ప్రయోజనం లేద న్నారు. ఖాళీలను భర్తీ చేసి నిరుద్యోగులకు న్యా యం చేయాలని కోరారు. ఇదే అంశంపై నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ సార్ ఆర్యోగం రోజురోజుకూ క్షీణిస్తోందన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు. అశోక్ ఆర్యోగం మెరుగు పడే వరకూ ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించాలన్నారు.
హనుమంత
వాహనంపై శ్రీనివాసుడు
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీ వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం రాత్రి శ్రీనివాసుడు హనుమంత వాహనంపై విహరించారు. ఉదయం ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. 11 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరిగింది.

డాక్టర్ వినయ్‌కుమార్‌కు జిల్లా ఆస్పత్రి బాధ్యతలు

డాక్టర్ వినయ్‌కుమార్‌కు జిల్లా ఆస్పత్రి బాధ్యతలు

డాక్టర్ వినయ్‌కుమార్‌కు జిల్లా ఆస్పత్రి బాధ్యతలు