
పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
పరిగి/దోమ: పేదల ఆరోగ్య పరిరక్షణే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దోమ మండలం బొంపల్లికి చెందిన నలుగురికి రూ.1.70 లక్షల విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రభాకర్ రెడ్డి, కిష్టాపూర్‌కు చెందిన అంజిలయ్య గౌడ్ నూతనంగా నిర్మించుకున్న గృహ ప్రవేశాలకు హాజరయ్యారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మాలి విజయ్‌కుమార్‌రెడ్డి, గ్రంథాల సంస్థ మాజీ డైరెక్టర్ బంగ్ల యాదయ్య గౌడ్, యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, బొంపల్లి ఎంపీటీసీ మాజీ సభ్యుడు వెంకట్, నాయకులు అంతిరెడ్డి, రాములు, రమేశ్, శేఖర్, బషీర్, హైమద్, ఇంతియాజ్, హరిలాల్, గోపాల్, యాదయ్య, నర్సింహులు, వెంకట్‌రెడ్డి, భీమయ్య తదితరులు పాల్గొన్నారు.
పార్టీలకు అతీతంగా..
సీఎం సహాయనిధి పేదలకు వరమని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకతీతంగా అర్హులను గుర్తించి సీఎం సహాయనిధి మంజూరు చేశారన్నారు. అనారోగ్యానికి గురై ప్రైవేట్‌లో మెరుగైన చికిత్స నిమిత్తం ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తుందన్నారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పరిగి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి తీరుతామన్నారు.