
హైవేల అభివృద్ధికి నిధులివ్వండి
తాండూరు: జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని స్పీకర్ ప్రసాద్‌కుమార్, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. శుక్రవారం వారు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో కేంద్ర మంత్రిని కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైదరాబాద్ – తాండూరు రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించాలని కోరారు. ఇప్పటికే జిల్లాలోని మన్నెగూడ వరకు నేషనల్ హైవే ఉందని, అక్కడి నుంచి తాండూరు వరకు, తాండూరు నుంచి ముంబై జాతీయ రహదారిని అనుసంధానం చేసేలా జహీరాబాద్ వరకు విస్తరించాలని కోరారు. ఇందుకోసం నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందింనట్లు స్పీకర్, ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నేత ఉత్తమ్‌చంద్ తదితరులు పాల్గొన్నారు.