
9శాఖలు 0 మొక్కలు
వనమహోత్సవంలో ఒక్క మొక్కా నాటని ఆయా విభాగాలు టార్గెట్ ఇచ్చినా నిర్లక్ష్యంగానే.. గడువు మరో పక్షం రోజులే.. ఈ ఏడాది లక్ష్యం 48,38,400 మొక్కలు ఇప్పటి వరకు నాటింది 35,82,283
పెద్దేముల్ అటవీ ప్రాంతంలో మొక్కలు నాటుతున్న కూలీలు
తాండూరు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమాన్ని కొన్ని శాఖలలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు టార్గెట్ ఇచ్చారు. కానీ తొమ్మిది శాఖల ఉద్యోగులు ఒక్క మొక్క కూడా నాటకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వానాకాలం సీజన్ ప్రారంభ దశలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. జూలై నెలలో సమృద్ధిగా కురవడంతో మొక్కలు నాటే ప్రక్రియను ప్రారంభించారు.
లక్ష్య ఛేదనలో..
ఈ ఏడాది జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, 20 మండలాల్లో 48.38 లక్షల మొక్కలు నాటేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది. 20 ప్రభుత్వ శాఽఖలు, నాలుగు మున్సిపాలిటీలకు టార్గెట్ కేటాయించారు. ఇప్పటి వరకు ఆయా శాఖలు 35,82,223 మొక్కలు నాటాయి. తొమ్మిది విభాగాలు మాత్రం ఒక్క మొక్క కూడా నాటలేదు. మరో పక్షం రోజులు మాత్రమే గడువు ఉండటంతో టార్గెట్ పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. డీఆర్‌డీఓ అధికారులు లక్ష్యానికి మించి మొక్కలు నాటారు. అటవీ శాఖ గమ్యానికి చేరువైంది.
ఆ జాబితాలో..
మొక్కలు నాటని జాబితాలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, నీటి పారుదల, వ్యవసాయ, మార్కెటింగ్, పోలీసు, పశు సంవర్ధక, గనులు, సంక్షేమ శాఖలు ఉన్నాయి. ఈ విభాగాలకు టార్గెట్ కేటాయించినా ఆ దిశగా ముందుకు సాగలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యం
శాఖ టార్గెట్ నాటిన మొక్కలు
అటవీ 3,60,000 2,70,774
వ్యవసాయ 6,38,500 0
పశు సంవర్ధక 5,000 0
ఆర్‌అండ్‌బీ 500 0
డీఆర్‌డీఓ 26,87,000 30,87,000
ఉద్యాన 2,55,400 2,55,400
పౌరసరఫరాల 2,000 2,000
విద్య 11,000 11,000
మార్కెటింగ్ 500 0
పంచాయతీరాజ్ 4,00,000 0
పరిశ్రమల 10,000 10,000
గనుల 58,000 0
ఎకై ్సజ్ 58,900 33,955
డీడబ్ల్యూఓ 1,000 0
పోలీసు 9,200 0
నీటి పారుదల 7,600 0
మున్సిపాలిటీ
తాండూరు 3,50,000 3,90,000
వికారాబాద్ 1,10,500 1,42,500
కొడంగల్ 3,25,000 3,25,500
పరిగి 83,550 63,854