
రేపు చలో కలెక్టరేట్
అనంతగిరి: జిల్లాలోని ట్రిపుల్‌ఆర్ భూ నిర్వాసితులతో రేపు చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి మహిపాల్ తెలిపారు. గురువారం నాలుగు మండలాల భూ బాధితులతో ఆయన మాట్లాడారు. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవద్దని సూచించారు. కొత్త అలైన్‌మెంట్‌తో పేద, మధ్య తరగతి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. పాత అలైన్‌మెంట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు కృష్ణారెడ్డి, సురేందర్, శ్రీను, నర్సింలు, బాలరాజు, రాంచంద్రయ్య జంగయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.