
బరిలో తొమ్మిది మంది
● మదర్ డెయిరీ సభ్యుల నియామకానికి 27న ఎలక్షన్
హయత్‌నగర్: నల్లగొండ– రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సమాఖ్య లిమిటెడ్(నార్ముల్ మదర్ డెయిరీ) పాలకవర్గ ఎన్నికల్లో తొమ్మిది మంది చివరి బరిలో నిలిచారు. డెయిరీలో ఖాళీగా ఉన్న ముగ్గురు సభ్యుల నియామకం కోసం దాఖలు చేసిన నామినేషన్ల ఉప సంహరణ, స్క్రూటినీ అనంతరం తొమ్మిది మంది తుది పోటీ లో ఉన్నారు. మహిళా రిజర్వేషన్ స్థానానికిగానూ కర్నాటి జయశ్రీ, గుంట్ల రాధిక, మోతె పూలమ్మ, సుదగాని విజయ తలపడనున్నారు. మిగిలిన రెండు అన్‌రిజర్వ్ స్థానాల్లో కుంచాల ప్రవీణ్‌రెడ్డి, పెద్దిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రచ్చ లక్ష్మీనర్సింహ్మారెడ్డి, శీలం వెంకటనర్సింహ్మారెడ్డి, సందిల భాస్కర్‌గౌడ్ పోటీ పడుతున్నారని ఎన్నిల అధికారి వెంకట్‌రెడ్డి తెలిపారు. హయత్‌నగర్‌లోని ఎస్‌వీ కన్వెన్షన్ హాల్ లో శనివారం ఉదయం 8 గంటల నుంచి ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగుతుందని స్పష్టంచేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు, విజేతల ప్రకటన ఉంటుందన్నారు. ఎన్నికయ్యే సభ్యులు అక్టోబర్ 1న బాధ్యతలు చేపడుతారని వెల్లడించారు. అర్హులైన సొసైటీల చైర్మన్లు ఐడీ కార్డుతో వచ్చి ఓటింగ్‌లో పాల్గొనాలన్నారు.