
భక్తి భావంతో మానసిక ప్రశాంతత
కడ్తాల్: ప్రతి ఒక్కరూ భక్తిమార్గం ఎంచుకోవాలని, తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జర్పుల దశరథ్‌నాయక్ అన్నారు. బుధవారం మండల పరిధి మద్దెలకుంట తండాలో సంత్ సేవాలాల్ మహారాజ్ మాలధారణ భక్తుల ఆధ్వర్యంలో ఇరుముడి పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా దశరథ్‌నాయక్ మాట్లాడుతూ.. సేవాలాల్ సత్యం,ఽ ధర్మం, సమానత్వం, ఽభక్తి విలువలు బోధించారని, ఆయన చూపిన మార్గంలో యువత నడుచుకోవాలని సూచించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజశాంతికి దోహదపడతాయని తెలిపారు. ఇందులో మాజీ సర్పంచ్ కస్ననాయక్ తదితరులు పాల్గొన్నారు.