
రికార్డుల నిర్వహణసక్రమంగా ఉండాలి
డీఎల్‌పీఓ ప్రవీణ్‌కుమార్
యాలాల: రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉంచుకోవాలని డివిజనల్ పంచాయతీ అధికారి ప్రవీణ్‌కుమార్ సూచించారు. బుధవారం యాలాల జీపీ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. రికార్డుల నిర్వహణ, పారిశుద్ధ్యం, అభివృద్ధి కార్యాచరణ తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. డీఎల్‌పీఓగా బాధ్యతలు చేపట్టాక ఆయన తొలిసారి మండలానికి రావడంతో ఎంపీఓ యాదయ్య ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో జీపీ కార్యదర్శి ఆనంద్‌రావు, సిబ్బంది సాయి, జగదీశ్వర్, జానీ తదితరులు ఉన్నారు.
రోడ్డుపై దిగబడిన లారీ
తాండూరు రూరల్: జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కల్వర్టు నిర్మాణం అనంతరం దానిపై పోసిన మట్టిలో ఓ సిమెంట్ ట్యాంకర్ లారీ బుధవారం దిగబడింది. వివరాలు ఇలా ఉన్నాయి. అల్లాపూర్ నుంచి కోత్లాపూర్ వరకు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఐనెల్లి గ్రామ శివారు వద్ద నేషనల్ హైవే అధికారులు కల్వర్టును తొలగించారు. ఆపై పైపులు వేసి, మట్టితో పూడ్చారు. భారీ వర్షాల కారణంగా సిమెంట్‌లోడ్‌తో వెళ్తున్న భారీ వాహనం రోడ్డు మధ్యలో కూరుకుపోయింది. దీంతో తాండూరు– చించోళి మార్గంలోని కోటబాసుపల్లి, మల్కాపూర్, కోత్లాపూర్, సంగెంకలాన్‌తో పాటు కర్ణాటకకు వెళ్లే వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. ఎట్టకేలకు జేసీబీ సహాయంతో ఆ వాహనాన్ని వెలుపలకు తీసి, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
ప్లాస్టిక్ గోదాంలో
అగ్ని ప్రమాదం
పహాడీషరీఫ్: ప్లాస్టిక్ గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సంఘటన బుధవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరాం కాలనీలోని ఇందిరా సొసైటీలో మధుబన్ కాలనీకి చెందిన శేషు, ప్లాస్టిక్ రీసైక్లింగ్ గోదాం నిర్వహిస్తున్నారు. ఉదయం 4 గంటల సమయంలో కర్మాగారంలో అగ్ని కీలలు ఎగిసి పడ్డాయి. గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. అప్పటికే అందులోని ప్లాస్టిక్ స్క్రాప్ పూర్తిగా కాలిపోయింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, రూ.8 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని యజమాని తెలిపారు. ఎలాంటి ఫిర్యాదు అందనందున కేసు నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు.
తుక్కుగూడ: విదేశీ వర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం(ఏఓఈఎఫ్) కింద 2025–26కు గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి జె.రామారావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్థులకు రూ.20లక్షల స్కాలర్‌షిష్ పొందేందుకు యూఎస్‌ఏ, ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్, కెనడా, న్యూజిలాండ్, సింగపూర్, సౌత్‌కొరియా, ఆస్ట్రేలియా, జర్మనీ వర్సిటీల్లో మెడిసిన్, ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులతో పాటు పీజీ, పీహెచ్‌డీ కోర్సులు చేయాలనుకునే వారు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. నవంబర్ 19 వదరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని చెప్పారు.
గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహారెడ్డి