
ప్రభుత్వ భూములు పేదలకు పంచాలి
● జిల్లా కార్యదర్శి మహిపాల్
● తహసీల్దార్ కార్యాలయం ఎదుట
సీపీఎం నిరసన
బంట్వారం: ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు బుధవారం బంట్వారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మహిపాల్ మాట్లాడారు. బొప్పునారంలో సర్వే నంబర్ 69లో దళితులకు కేటాయించిన ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయాలన్నారు. భూస్వాముల అక్రమ పట్టాలను వెంటనే రద్దు చేయాలన్నారు. మైనింగ్, బీడు భూములకు రైతుభరోసా నిలిపేయాలని సూచించారు. అనంతరం డీటీ మహేశ్‌కు వారు వినతి పత్రం అందజేశారు.