
జీఓ ప్రకారం వేతనాలు ఇవ్వాలి
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు
మొయినాబాద్: మున్సిపల్ కార్మికులకు జీఓ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రుద్రకుమార్, అల్లి దేవేందర్ డిమాండ్ చేశారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం పుర కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పురపాలిక సంఘం ఏర్పడి 9 నెలలు అవుతున్నా.. వేతనాల విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ చట్టం ప్రకారం వేతనాలు, యూనిఫాంలు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో విధులు బహిష్కరించి, ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ మేనేజర్ జమీర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ ప్రవీణ్‌కుమార్, నాయకులు మహేందర్, అశోక్, నగేష్‌గౌడ్, రత్నం, సుధాకర్, సురేష్, కృష్ణ, జగన్, నర్సింహ్మ, వెంకటేశ్, ప్రమీల ఉన్నారు.