
అక్రమ తవ్వకాలను ఆపేయండి
● ప్రజాసంఘాల డిమాండ్
● తహసీల్దార్ పద్మావతికి వినతిపత్రం
బొంరాస్‌పేట: కొత్తూరు శివారులోని మాలగుట్ట నుంచి మట్టి తవ్వకాలను నిలిపేయాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టను తవ్వుతూ పరిగితో పాటు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టర్, పోలీసులు కుమ్మకై ్క ఈ వ్యవహారం నడిపిస్తున్నారని ఆరోపించారు. అక్రమ తవ్వకాలను వెంటనే ఆపేయాలని తహసీల్దార్ పద్మావతికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కె.చంద్రయ్య , సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు వెంకటయ్య, ఎమ్మార్పీఎస్ నాయకుడు సుభాన్, కేఎన్‌పీఎస్ జిల్లా నాయకులు లక్ష్మయ్య, కుర్వ హక్కుల పోరాట సమితి నాయకుడు బాలప్ప, బాల్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, మహేందర్, జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.