
ఉచిత వైద్య శిబిరానికి స్పందన
తాండూరు: పట్టణంలోని మాతాశిశు ఆస్పత్రి ఆవరణలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. మంగళవారం జిల్లా వైద్య శాఖ స్వస్త్ నారీ సశక్త్ అభియాన్‌లో భాగంగా మహిళలకు, చిన్నారులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి జిల్లా వైద్యాధికారి, లలితాదేవి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రవీంద్రయాదవ్, ఎంసీహెచ్ సూపరింటెండెంట్ సునిత, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రాజులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక, ఆరోగ్య భద్రత కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ప్రవీణ్, కార్తీక్, పద్మ, షౌల్ హమీద్, కవిత, ప్రసాద్‌నాయక్, సుధామాయ్, విగ్నేష్, అపర్ణ, శ్రీలతలు పది విభాగాలకు చెందిన పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్‌రెడ్డి, పట్టణ వైద్యాధికారి గిరిధర్‌యాదవ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి థారాసింగ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
320 మందికి పరీక్షలు చేసిన డాక్టర్లు