
అన్నదాతకు అండగా నిలుస్తాం
బషీరాబాద్ ఏఎంసీ చైర్మన్ మాధవరెడ్డి
బషీరాబాద్: మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ అన్నదాతలకు అండగా నిలుస్తుందని బషీరాబాద్ ఏఎంసీ చైర్మన్ మాధవరెడ్డి అన్నారు. సోమవారం కార్యాలయంలో జరిగిన పాలకవర్గం సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. రైతులు పండించిన ధాన్యానికి మంచి ధర కల్పించడంతో పాటు మార్కెటింగ్ చేసేందుకు తోడుగా నిలుస్తుందని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులు పెంచేలా రైతులకు అవగాహన కల్పించడంలో భాగంగా, ఇతర రాష్ట్రాల్లో పర్యటనకు పాలకవర్గానికి అనుమతి లభించిందన్నారు. ఆఫీసులో ఫర్నిచర్ కొనుగోలుకు రూ.2 లక్షలు మంజూరైనట్లు చెప్పారు. ఇటీవల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్మన్ల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై న మాధవరెడ్డిని పాలకవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చందర్‌నాయక్, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్‌రామ్‌రెడ్డి, డైరెక్టర్లు మహేందర్‌రెడ్డి, హన్మంతు, మోహన్, నరేష్, నరేష్ రాథోడ్, సత్యానందం, మునీర్, పాండురంగం, నరేష్ మర్పల్లి, పెంటప్ప, వనమాల, సెక్రటరీ సిద్ధమ్మ తదితరులు పాల్గొన్నారు.