
ఎంబీబీఎస్ సీటు సాఽధించిన విద్యార్థులు
కొడంగల్: పట్టణానికి చెందిన ఏవీ అఖిల్ యాదవ్ నీట్‌లో మెరుగైన ర్యాంక్ సాధించి ఉచితంగా ఎంబీబీఎస్ సీటు పొందారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీ పరీక్షలో 469 మార్కులు వచ్చాయి. దీంతో కాళోజీ నారాయణరావ్ యూనివర్సిటీ నిర్వహించిన కౌన్సెలింగ్‌లో హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. సోమవారం హైదరాబాద్ వెళ్లి మెడికల్ కాలేజీలో జాయిన్ అయినట్లు అఖిల్ యాదవ్ తండ్రి ఏవీ పృథ్విరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా అఖిల్ యాదవ్ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మెడికల్ సీటు సాధించినట్లు చెప్పాడు. భవిష్యత్తులో వైద్య వృత్తిలో స్థిరపడి రోగులకు సేవ చేయనున్నట్లు తెలిపారు. అఖిల్ యాదవ్‌కు టీయూడబ్లూజే(ఐజేయూ) రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిషన్ రావ్, నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు కత్తి ప్రభాకర్, కొడంగల్ ప్రెస్ క్లబ్ సభ్యులు చామంతి ప్రభాకర్, కానుకుర్తి రమేష్, రాకేష్ యాదవ్, పకీరప్ప, నరేందర్, గోపాల్, బొంకురు నరేష్, గడ్డం రాచయ్య అభినందనలు తెలిపారు.