
అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
కుల్కచర్ల: అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ అన్నారు. సోమవారం గిరిజన సంఘాల చలో హైదరాబాద్ పిలుపు మేరకు.. పలువురు నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని రాద్దాంతం చేస్తున్న నాయకుల తీరుకు నిరసనగా గిరిజనులు ఆందోళన చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఐక్యంగా ప్రభుత్వ తీరుకు నిరసనగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చూస్తే దేశవ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కుట్రకు పాల్పడుతున్న సోయం బాపురావు, తెల్లం వెంకట్రావులను కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి బలరాం నాయక్, మండల అధ్యక్షుడు ప్రకాష్ నాయక్, మండల ప్రధాన కార్యదర్శి గణేశ్ నాయక్, జిల్లా కార్యవర్గ సభ్యులు అంబర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
జీవీఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్