
పూలతోట.. సిరుల పంట
పండుగల వేళ.. పూలకు క్రేజీ ఏర్పడింది. రోజువారీగా ఎలాంటి కార్యాలు చేపట్టినా.. పుష్పాలకు తగిన ప్రాధాన్యం ఉంటుంది. కానీ.. వెనువెంటనే వస్తున్న బతుకమ్మసంబురాలు, దేవీ నవరాత్రోత్సవాలు,అనంతరం దీపావళి పండుగల నేపథ్యంలో డిమాండ్ బాగా పెరిగింది. వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పూతోటల రైతులకు లాభాల పంట పండిస్తున్నాయి.
యాచారం: హైదరాబాద్ మహానగరం చుట్టూ విస్తరించి ఉన్న జిల్లా పరిధి వ్యవసాయ పొలాలు పూ తోటలకు ప్రసిద్ధి. ఇబ్రహీంపట్నం, శంషాబాద్, రాజేంద్రనగర్, చేవేళ్ల, కందుకూరు, షాద్‌నగర్, మహేశ్వరం, హయత్‌నగర్‌లో పూల సాగుకు అనుకూలమైన నేలలు ఉండడంతో.. ఆయా ప్రాంతాల రైతులు పూ తోటల పెంపకంపై దృష్టి సారించారు. సీజన్లను బట్టి సుమారు రెండు వేల ఎకరాలకు పైగానే బంతి, చామంతి, కనకాంబరాలు, మల్లె, గులాబీని సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి, అంతే శ్రమతో స్వల్పకాలంలోనే అధిక లాభాలు పొందుతున్నారు. ఒక రకంగా పూ తోటలు.. వారి ఇంట్లో సిరులు కురిపిస్తున్నాయి.
పూల సాగుకు ఆసక్తి
రాజధానికి చేరుకునే శ్రీశైలం, నాగార్జునసాగర్, క ర్నూల్, బీజాపూర్, విజయవాడ జాతీయ రహదారులకు ఇరువైపులా సాగు భూములున్న రైతులు.. పూతోటల పెంపకానికి ఆసక్తి చూపుతున్నారు. కాలానికి అనుగుణంగా పంట పండిస్తూ.. హైవేపైనే విక్రయిస్తుంటారు. తాజా పూలు కావడంతో ప్రజలు కొనుగోలు చేయడానికి మక్కువ చూపుతున్నారు. పొలాల వద్దకే వచ్చిన కొనుగులు చేస్తుండటంతో ఇది రైతులకు బాగా కలిసి వస్తోంది. బంతి కిలోకు రూ.50 నుంచి వంద లోపు డిమాండ్ ఉండగా, అదే చామంతి, కనకాంబరాలు, మల్లె, గులాబీ తదితర వాటికి కిలో రూ.150 పైగానేఉంటుంది.
డిమాండ్‌ను బట్టి..
డిమాండ్‌ను బట్టి రైతులు పూల సాగును చేస్తున్నారు. బోనాలు, వినాయక చవితికి మంచి లాభాలు పొందారు. బతుకమ్మ, దసరా, దీపావళి, కొద్ది రోజుల్లో వచ్చే కార్తీక మాసంలో 41 రోజుల పాటు భక్తీశ్రద్ధలతో జరిగే అయ్యప్ప పూజలనుదృష్టిలో ఉంచుకొని సాగు చేస్తూ.. ఆదాయంపొందేందుకు ప్రణాళిక చేసుకున్నారు. కొందరు రైతులు స్థానికంగానే విక్రయిస్తుండగా.. మరికొందరు నగరానికి తరలిస్తున్నారు.
ఏడు ఎకరాల్లో బంతి
రూ.లక్షన్నర పెట్టుబడి తో ఏడు ఎకరాల్లో బంతిని సాగు చేస్తున్నాను. దసరా పండుగ సందర్భంగా.. పూలను కోసం హైవేపై విక్రయిస్తున్నాం. రానున్న దీపావళి, కార్తీకమాసంలో మంచి లాభాలు వస్తాయనే నమ్మకం ఉంది.
– కృష్ణ, పూల వ్యాపారి, చౌదర్‌పల్లి
పూలతోనే పూజ
కార్తీక మాసం అయ్యప్ప దీక్షలో 41 రోజుల పాటు పూలతో మణికంఠుడికి ప్రత్యేక పూజలు చేస్తాం. అందులో ఎక్కువగా బంతిపూలే ఉంటాయి. ఇతర పుష్పాలతో దేవతామూర్తులకు అలంకరణ చేస్తాం. ధర ఎంతున్నా.. భక్తితో కొనుగోలు చేస్తాం. కార్యక్రమాలు నిర్వహిస్తాం.
– నారాయణశెట్టి, యాచారం
పండుగల వేళ..భళే డిమాండ్
హైవేలపై విక్రయిస్తున్న రైతులు
కిలో బంతికి రూ.50,
చామంతికి రూ.150
తాజా పూలను కొనుగోలుచేసేందుకు ప్రజల ఆసక్తి

పూలతోట.. సిరుల పంట

పూలతోట.. సిరుల పంట

పూలతోట.. సిరుల పంట