
విద్యార్థులు దేశసేవలో భాగస్వామ్యులు కావాలి
జవహర్‌నగర్: జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని బిట్స్ పిలానీ క్యాంపస్‌లో రచయిత్రి రాయపూడి ఆశాలత, ఆమె కుమారుడు రంజీ ట్రోఫీ క్రికెటర్ రాయపూడి నాగేంద్ర ఆధ్వర్యంలో రచించిన ‘అమ్మ ఒడి – నా తెలంగాణ’ పుస్తకాన్ని ఆదివారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. విద్యార్థులు దేశసేవలో భాగస్వామ్యులు కావాలన్నారు. ప్రపంచ దేశాల్లో డిజిటలైజేషన్ దేశంగా భారతదేశం నిలవడం సంతోషంగా ఉందన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో ప్రపంచ దేశాలను ధీటుగా భారతదేశం అవతరించిందన్నారు. ఆదివాసీ ప్రాంతాన్ని ఎంచుకొని వారి స్థితిగతులపై పరిశోధనలు చేసి విద్యా, ఆరోగ్య, ఉపాధి కల్పించి పేదరికాన్ని పాలదోలమే లక్ష్యంగా ఐఐటీ విద్యార్థి, రంజీ ట్రోపీ క్రికెటర్ నాగేంద్ర పని చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో హరియాణా మాజీ గవర్నర్ దత్తాత్రేయ, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్‌బాబు, బిట్స్ పిలానీ డైరెక్టర్ సౌమ్యో ముఖర్జీ, డీన్ యేగేశ్వరి పాల్గొన్నారు.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
అమ్మ ఒడి – నా తెలంగాణ
పుస్తకావిష్కరణ