
క్రీడలు అలవాటుగా మార్చుకోవాలి
శంషాబాద్: క్రీడలు పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో అలవాటుగా మార్చుకోవాలని రాజేంద్రనగర ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ సూచించారు.ఆదివారం పట్టణంలో ఎస్‌ఎస్ స్కేటింగ్ మైదానంలో మహబూబ్‌నగర్ జిల్లా రోలర్ స్కేటింగ్ చాంఫియన్ షిప్ 2025 పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.... చిన్న వయసుల్లో క్రీడాభిరుచిని పెంచడం ఎంతో మంచిదన్నారు. క్వాడ్, ఇన్‌లైన్ విధానాల్లో నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ ప్రతిభకనబర్చిన వారిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ సుష్మ, మాజీ వైస్ చైర్మన్ బండిగోపాల్, మాజీ కౌన్సిలర్ మేకల వెంకటేష్ ముదిరాజ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పి.సంజయ్‌యాదవ్, సీనియర్ నాయకులు దూడల వెంకటేష్‌గౌడ్, జి.వై.ప్రభాకర్ పాల్గొన్నారు.
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్
ఉత్సాహంగా స్కేటింగ్ పోటీలు