
బండ్లగూడను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
బండ్లగూడ: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆదర్శవంతంగా అభివృద్ధి చేసేందుకు నిధులను మంజూరు చేసి అభివృద్ధి పరుస్తున్నామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు హరీశ్‌గౌడ్ ఆధ్వర్యంలో శివసాయినగర్ కాలనీ వాసులు ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి చేయాల్సిన పనులను ఎమ్మెల్యేకు వివరించారు. ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ సానుకూలంగా స్పందించి వెంటనే కార్పొరేషన్ కమిషనర్‌కు ఫోన్ చేసి జరగవలసిన అభివృద్ధి పనులకు సంబంధించిన ఎస్టిమేషన్స్ వేసి వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని సూచించారు. కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా సంవత్సరంలోనే ఇప్పటికే వంద కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే వివరించారు. బండ్లగూడ కార్పొరేషన్‌ను రాజేంద్రనగర్ నియోజకవర్గంలోనే గొప్ప కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేను శాలువాలతో సత్కరించారు. కాలనే నేతలు బహుబలి వినయ్, రాజేష్, భరత్, హేమంత్, రాధిక, రేణుక, రజిత తదితరులు పాల్గొన్నారు.