
ఏనుగు జంగారెడ్డికి గ్లోబల్ పీస్ అవార్డు
కందుకూరు: అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ సిటిజన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్‌నారాయణ సూచన మేరకు సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్ జి.వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఆదివారం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏనుగు జంగారెడ్డికి గ్లోబల్ పీస్ అవార్డు–2025 ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. జంగారెడ్డి అహింసా మార్గంలో విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉంటూ యువతకు మార్గదర్శంగా నిలిచారని, అందుకే అవార్డుకు ఎంపిక చేశామని తెలిపారు. అవార్డు గ్రహీత మాట్లాడుతూ.. హింసా మార్గం ద్వారా ఏమీ సాధించలేమని అన్నారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.కృష్ణనాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, సంస్థ నిర్వాహకులు బిచ్చుకారి సూర్య, ఢిల్లీ శివకుమార్, అందుగుల సత్యనారాయణ, సీనియర్ నాయకులు రాకేష్‌గౌడ్, సౌడపు వెంకటేశ్, యు.బాబురావు, మహేందర్, నరసింహా, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.