
హామీలు అమలు చేయాలి
కొడంగల్ రూరల్: కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇ
చ్చిన హామీలు అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ.. దివ్యాంగులకు రూ.6 వేలు, సాధారణ పెన్షన్ రూ.4 వేలకు పెంచుతామన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పుతోందన్నారు. పెన్షన్ దరఖాస్తులను ఆమోదించిన ప్రతీ ఒక్కరికి నూతన పెన్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కొడంగల్ ప్రధాన చౌరస్తా నుంచి తహసీల్దార్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి గజ్జల ప్రకాశ్, దివ్యాంగులు, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.
కొత్త పెన్షన్లు ఇవ్వాలి
అనంతగిరి: ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం పెన్షన్లను పెంచాలని ఎంఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన వృద్ధులు, దివ్యాంగులు, ఎంఎస్‌పీ నాయకులతో కలిసి వికారాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా కొత్త పెన్షన్‌లు ఇవ్వలేదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి దసరా నుంచే పెన్షన్‌లను మంజూరు చేయాలన్నారు.
ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుభాష్

హామీలు అమలు చేయాలి