
వసతి గృహాల్లో సెలవుల సందడి
● తల్లిదండ్రులు, విద్యార్థులతో కిక్కిరిసిన హాస్టళ్లు
● దసరా హాలీడేస్ నేపథ్యంలోఇంటిబాట పట్టిన విద్యార్థులు
దుద్యాల్: ప్రభుత్వ పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించడంతో గురుకులాలు, కేజీబీవీల్లో శనివారం సందడి కనిపించింది. జూన్ మాసంలో పాఠశాల పునఃప్రారంభం నుంచి ఇప్పటి వరకు సెలవులు లేకపోవడంతో కొంత ఒత్తిడికి గురైన విద్యార్థులకు పండగు హాలీడేస్ ఉపశమనం కలిగించాయి. తమను తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రులు, పోషకులతో సంతోషంగా ఇంటిబాట పట్టారు. పిల్లల కోసం వచ్చిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో సంక్షేమ హాస్టళ్లు కిక్కిరిసిపోయాయి. విద్యార్థులు ఇంటికి వెళ్తున్న తరుణంలో బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలు కిక్కిరిసిపోయాయి. పలుచోట్ల ఆర్టీసీ బస్సులను ఆపకపోవడంతో ప్రైవేటు వాహనాల్లో ఇళ్లకు చేరుకున్నారు.

వసతి గృహాల్లో సెలవుల సందడి