
చెంచుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
కుల్కచర్ల: చెంచుల సంక్షేమానికి ప్రభుత్వాలు అందిస్తున్న సదుపాయాలు, సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి కమలాకర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామంలోని చెంచు కాలనీలో జిల్లా అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలనీలో చేపట్టిన అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియను ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు. చెంచుల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయని వివరించారు. వాటిని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని సూచించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి జహంగీర్, ఎంపీడీఓ రామకృష్ణ ఆధ్వర్యంలో స్వచ్ఛతే సేవ కార్యక్రమాన్ని నిర్వహించా రు. విద్యార్థులతో అవగాహన ర్యాలీ తీశారు. కా ర్యక్రమంలో హౌసింగ్ శాఖ పీడీ సయ్యద్ మక్రం, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ రవికుమార్, మిషన్ భగీరథ డీఈ సుబ్రహ్మణ్యం, ఏఈ అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.