
పని ఒత్తిడి తగ్గించండి
అనంతగిరి: జిల్లాలో ఆయా హోదాల్లో విధులు నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గించాలని తెలంగాణ మెడికల్ అండ్ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ చంద్రప్రకాష్ కోరారు. శుక్రవారం ఈ మేరకు అడిషనల్ కలెక్టర్ లింగ్యానాయక్, డీఎంహెచ్‌ఓ లలితాదేవికి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమకు ఆధార్ బేస్‌డ్ అటెండెన్స్ సిస్టమ్‌ను రద్దు చేయాలన్నారు. క్షేత్రస్టాయి సేవలో నిమగ్నమవుతుండటంతో ఆరోగ్య కేంద్రాలకు వచ్చి హాజరు నమోదు చేసుకోవాలంటే చాల ఇబ్బంది కలుగుతుందన్నారు. ఆన్‌లైన్ యాప్‌లు, ఆన్‌లైన్ ఎంట్రీలు లేకుండా చేయాలన్నారు. తప్పనిసరైతే ప్రతి పీహెచ్‌సీకి ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్‌ను నియమించి ఆన్‌లైన్ పనులు చేయించాలన్నారు. పని ఒత్తిడితో అనారోగ్యాల బారిన పడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీనివాస్, రేణుకుమార్, వెంకన్న, తిరుపతయ్య, రవీందర్‌రెడ్డి, ప్రకాష్, ఫకీరప్ప, అమరేశ్వరి, విజయలక్ష్మి, అనిత, విమల, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.