
టీఎల్‌ఎం మేళాతో బోధన సులభతరం
అనంతగిరి: టీఎల్‌ఎం మేళాతో విద్యార్థులకు సులభతరంగా బోధన చేయడానికి అవకాశం ఉంటుందని అడిషనల్ కలెక్టర్ సుధీర్ అన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు టీఎల్‌ఎం మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు ఆయా సబ్జెక్టులకు సంబంధించిన 200లకు పైగా ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. తొమ్మిది ప్రదర్శనలు రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. కార్యక్రమంలో డీఈఓ రేణుకాదేవి, మండల విద్యాధికారి బాబుసింగ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయికి ఉపాధ్యాయులు
దోమ: టీఎల్‌ఎం రాష్ట్రస్థాయి మేళాకు మండలం నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. మోత్కూర్ పాఠశాలకు చెందిన పాండురంగాచారి(తెగులు), దాదాపూర్ పాఠశాలకు చెందిన యాదగిరి(ఈవీఎస్, పరిసరాల విజ్ఞానం) విద్యార్థులకు అందిస్తున్న టీఎల్‌ఎం మేళాలో జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కార్యాలయంలో జిల్లా విద్యాధికారి రేణుకాదేవి వానికి ప్రశంస పత్రాన్ని అందించి అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయులు తమ తమ వృత్తిని బాధ్యతతో నిర్వహిస్తే ఎన్నో ప్రశంస పత్రాలను అందుకుంటారని తెలిపారు.
జిల్లాస్థాయిలో శ్వేతారాణి ప్రతిభ
తాండూరు రూరల్: జిల్లాస్థాయిలో నిర్వహించిన టీఎల్‌ఎం మేళాలో తాండూరు మండలం కొత్లాపూర్ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు శ్వేతారాణి ప్రతిభ చాటారు. ఇంగ్లిష్ పాఠ్యాంశాలను నూతన పద్ధతుల్లో బోధన చేయడంపై టీఎల్‌ఎం మేళాలో నమూనాలు ప్రదర్శించారు. దీంతో శ్వేతరాణికి జిల్లాస్థాయిలో రెండో బహుమతి లభించింది. డీఈఓ రేణుకాదేవి చేతులమీదగా సర్టిఫికెట్ అందుకున్నారు. తమ పాఠశాల ఉపాధ్యాయురాలు టీఎల్‌ఎం మేళాలో రెండో బహుమతి సాధించడంపై పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు, పాఠశాల హెచ్‌ఎం వినోద్‌కుమార్ అభినందించారు. ఉపాధ్యాయురాలి కృషిని సృజనాత్మకతతో పిల్లలకు సులభతరంగా బోధన చేయడానికి అవకాశం ఉంటుందన్నారు.
తాండూరు రూరల్: నమూనాతో శ్వేతారాణి
వికారాబాద్‌లో టీఎల్‌ఎం మేళా
అడిషనల్ కలెక్టర్ సుధీర్

టీఎల్‌ఎం మేళాతో బోధన సులభతరం

టీఎల్‌ఎం మేళాతో బోధన సులభతరం

టీఎల్‌ఎం మేళాతో బోధన సులభతరం