
దాడికి పాల్పడిన వ్యక్తికి రిమాండ్
తాండూరు రూరల్: సిగరెట్ ఇవ్వలేదనే కోపంతో దుకాణా యజమానిపై దాడికి పాల్పడిన వ్యక్తిని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి కరన్‌కోట్ ఎస్‌ఐ రాథోడ్ వినోద్ కథనం ప్రకారం.. చిట్టిఘనాపూర్ గ్రామానికి చెందిన ఈడ్గి అంజయ్యగౌడ్ అదాని సిమెంట్ ఫ్యాక్టరీ గేటు ఎదుట కిరాణషాపు నిర్వహిస్తున్నాడు. ఈనెల 10న బెల్కటూర్‌కు చెందిన అడివప్ప మద్యం తాగి, అంజయ్యగౌడ్ షాపు వద్దకు వెళ్లి సిగరెట్ ఇవ్వాలని కోరాడు. రాత్రి కావడంతో షాపు బంద్ చేస్తున్నానని, సిగరెట్ కూడా లేదని యజమాని చెప్పడంతో ఆగ్రహానికి గురైన అడివప్ప అతనిపై కర్రతో దాడి చేశాడు. బాధిత కుటుంబ సభ్యులు వెంటనే అంజయ్యగౌడ్‌ను చికిత్స నిమిత్తం తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడిలో అతని కుడిచేయి విరిగిపోయిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో అడివప్పపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన కరన్‌కోట్ పోలీసులు శుక్రవారం అతన్ని కొడంగల్ న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు.