
మాది చేతల ప్రభుత్వం
షాబాద్: మారుమూల గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వ కృషి చేస్తోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వారు మండల పరిధిలోని చందనవెళ్లిలో సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వమన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు వస్తాయన్నారు. గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు మందుకు సాగుతోందన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చిన ఘతన తమదే అన్నారు. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కుమ్మరి చెన్నయ్య, మాజీ సర్పంచ్‌లు మహేందర్‌గౌడ్, రవీందర్‌నాయక్, పార్టీ నాయకులు స్వామి, రాహుల్‌గుప్తా, వేమారెడ్డి, బేగరి యాదయ్య, ప్రభాకర్‌రెడ్డి, కిషోర్‌నాయక్, మాధవరెడ్డి, శేఖర్, గౌరీ, రాఘవేందర్, శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య