
పర్యాటక కేంద్రంగా ‘పాంబండ’
● ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
● టూరిజం శాఖ ఈడీ ఉపేందర్‌రెడ్డితో కలిసి ఆలయం సందర్శన
కుల్కచర్ల: పాంబండ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ టూరిజం శాఖ ఈడీ ఉపేందర్ రెడ్డితో కలిసి శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రోప్ వే, రిసార్ట్స్ నిర్మించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కోట్ల మైపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, ఆలయ అర్చకులు పాండు శర్మ, డీసీసీ కార్యదర్శి యాదయ్య, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, యూత్ విభాగం అధ్యక్షుడు జంగయ్య, నాయకులు గోవర్ధన్ రెడ్డి, భరత్‌కుమార్ రెడ్డి, వెంకటేష్, వెంకటయ్య, రాధారెడ్డి, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో మానసికోల్లాసం
పరిగి: క్రీడలు ఆడటంతో మానసిక ఉల్లాసం పెంపొందుందని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పట్టణ కేంద్రంలోని మినీ గ్రౌండ్‌లో 69వ ఎస్‌జీఎఫ్ పరిగి జోనల్‌స్థాయి అండర్ 14, 17 కబడ్డీ పోటీలను గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు క్రీడల్లో రాణించి పరిగికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. క్రీడల్లో రాణించడం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నారు. విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. క్రీడల ద్వారా విద్యార్థులకు క్రమశిక్షణ, పట్టుదల, స్ఫూర్తి, శారీరక క్రమశిక్షణ పొందుతాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో క్రీడాకారులకు ప్రత్యేక కోటా ఉంటుందన్నారు.
ప్రతి పేదవాడికీ నాణ్యమైన వైద్యం
అంతకుముందు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్‌ఆర్ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ.. గతంలో కంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందుతుందన్నారు. పరిగిలో త్వరలోనే వంద పడకల ఆస్పత్రి అందుబాటులోకి రానుందన్నారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, వైస్ చైర్మన్ అయూబ్, కుల్కచర్ల ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు, డీసీసీ ఉపాధ్యక్షుడు హన్మంతుముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.