
సరైన వైద్యం అందక..
పరిగి: పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో మౌలిక వసతులు లేకపోవడం, సరైన వైద్య సేవలు అందక రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పరిగి మండలం తోపాటు, దోమ, కుల్కచర్ల, బొంరాస్‌పేట్ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. రోజూ 300 నుంచి 350 మంది వరకు ఓపీ ఉంటుంది. 20 మందికిపైగా ఇన్‌పేషెంట్లు ఉన్నారు. ఇంత రద్దీ ఉండే ఆస్పత్రిలో వైద్యులు రోగులను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 8 మంది డాక్టర్లు, 50 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతి నెలా 20కి పైగా ప్రసవాలు చేస్తున్నారు. షిఫ్ట్‌ల వారీగా డెంటల్, గైనకాలజిస్ట్, చిన్న పిల్లల వైద్యులు పని చేస్తున్నారు. అత్యవసర చికిత్సలు రోడ్డు ప్రమాదాలు ఇతర కేసులు వస్తే వైద్యులు వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
నేను పరిగి పట్టణంలోని తుంకుల్‌గడ్డలో ఉంటా. తెలిసిన మహిళ కడుపుతో ఉండటంతో ఆస్పత్రికి తీసుకొచ్చా. ఇక్కడి వైద్యులు పట్టించుకోవడం లేదు. ఆశావర్కర్లతో రావాలని అంటున్నారు. వారు లేరని చెప్పినా చికిత్స చేయలేదు. మా కాలనీ నుంచి నిత్యం ప్రజలు వస్తుంటారు. ఎవ్వరికీ సరైన వైద్యం అందడం లేదు.
– భారతి, తుంకుల్‌గడ్డ, పరిగి

సరైన వైద్యం అందక..