
కొడంగల్ ఆస్పత్రిలో
కొడంగల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతం కావడంతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో 24 గంటల పాటు వైద్యలు అందుబాటులో ఉంటున్నారు. నిత్యం 300 మందికి పైగా రోగులు వస్తున్నారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి.
ఈ ఆస్పత్రి స్థాయిని పెంచి 220 పడకల టీచింగ్ హాస్పిటల్‌గా అప్ గ్రేడ్ చేశారు. ఇందులో భాగంగా అన్ని వసతులతో కూడిన నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 134 రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. బయో కెమిస్ట్రీలో 56, పాథలాజీలో 37, మైక్రో బయోలజీలో 41 రకాల పరీక్షలు చేస్తున్నారు. ప్రతి రోజూ రక్త, మూత్ర, ఇతర పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎక్స్‌రే, ఈసీజీ యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు.