
వైద్యం కోసం వచ్చిన రోగులు
వికారాబాద్: ఏడాది క్రితం నుంచి వికారాబాద్‌లో 330 పడకల బోధనాస్పత్రి కొనసాగుతోంది. రెండు నెలల క్రితం కొత్త భవనంలోకి ఆస్పత్రిని మార్చారు. అత్యవసర విభాగానికి చెందిన భవనం ఒక్కటే అందుబాటులోకి రావాల్సి ఉంది. ఇక్కడ 86 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 70 మంది రెగ్యులర్, నలుగురు కాంట్రాక్టు పద్ధతిన విధులు నిర్వహిస్తున్నారు. 135 మంది హెడ్ నర్సులు, 36 మంది నాల్గో తరగతి ఉద్యోగులు సేవలందిస్తున్నారు.
కుటుంబ నియంత్రణ, అపెండెక్స్ తదితన ఆపరేషన్లు చేస్తున్నారు. అనుమతులు వచ్చినా ఇంకా సిటీ స్కానింగ్ యంత్రాన్ని కొనుగోలు చేయలేదు. ప్రస్తుతం రోజుకు సగటున 400 నుంచి 500 మంది వరకు ఓపీ నమోదవుతోంది. 20 నుంచి 30 మంది వరకు ఇన్ పేషంట్లు ఉన్నారు. టీ హబ్ ల్యాబ్‌లో అందుబాటులో ఉన్నా ఇంకా టూడీ ఈకో( గుండె సంబంధిత) పరీక్షల మిషన్ రాలేదు. సాధారణ మందులు అందుబాటులో ఉన్నాయి.