
అవినీతి నిర్మూలనకే సామాజిక తనిఖీలు
మర్పల్లి: ఉపాధి హామీ పథకంలో అవినీతికి చోటు లేకుండా చూసేందుకే ప్రభుత్వం సామాజిక తనిఖీలు నిర్వహిస్తోందని మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం 11నుంచి రాత్రి 10.20 గంటల వరకు మండల పరిషత్ కార్యాలయంలో సామాజిక తనిఖీ నిర్వహించారు. 2024 మార్చి 1నుంచి 2025 మార్చి 31 వరకు మండలంలో చేపట్టిన పనులు, ఖర్చు చేసిన నిధులను ఓపెన్ ఫోరంలో చదివి వినిపించారు. 27 పంచాయతీల్లో రూ.12 కోట్లకు పైగా విలువ చేసే పనులకు సంబంధించి ఉపాధి పథకం కింద కూలీలకు డబ్బులు చెల్లించారన్నారు. అవకతవకలకు పాల్పడిన పలువురు గ్రామాల బాధ్యులకు రూ.30 వేల చొప్పున పెనాల్టీ విధించారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లేశ్‌యాదవ్, డీఆర్‌డీఓ అంబుడ్స్ మెన్ గుర్రం రాములు, అడిషనల్ పీడీ సరళ, ఏపీఎం భార్గవి, ఎంపీడీఓలు సీటి జయరామ్, రాజమల్లయ్య, ఎస్‌ఆర్‌సీ ముత్తు, ఏపీఓ అంజిరెడ్డి, ఈసీ విఠల్ తదితరులు పాల్గొన్నారు.