
లింగంపల్లిలో యూపీ బృందం పర్యటన
నవాబుపేట: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, కన్సల్టెంట్లు మంగళవారం మండల పరిధిలో లింగంపల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కూలీలు బతుకమ్మ పాటలతో వారికి స్వాగతం పలికారు. అనంతరం ఉపాధి హామీ పథకం కింద గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను వారికి వివరించారు. పేదరిక నిర్మూలన, జీవనోపాధి వృద్ధి పంచాయత్, పెన్షన్లు, పంచాయతీల పనితీరు, మిషన్ భగీరథ నీళ్లు, నర్సరీల నిర్వహణ, సర్పంచులు, అధికారుల పాత్ర తదితర విషయాలను ఎమ్మెల్యే కాలె యాదయ్య, మండల అధికారులు వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌పీఓ సంధ్యారాణి, ఎంపీడీవో అనురాధ, ఎంపీఓ విజయ్కుమార్, ఏఓ జ్యోతి, ఏపీఓ లక్ష్మీదేవి, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.