
లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ
తాండూరు రూరల్: తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో లైసెన్స్డ్ సర్వేయర్లుకు శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూ భారతి చట్టంలో వీరు కీలక పాత్ర పోషించనున్నారు. ఈ సర్వేయర్లు మొదటి దఫా శిక్షణలో భాగంగా 50 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్నారు. అనంతరం ప్రభుత్వ సర్వేయర్ వద్ద మరో 40 రోజుల పాటు శిక్షణ తీసుకుంటున్నారు. ఈ నెల 25తో వీరి శిక్షణ పూర్తికానుంది. మంగళవారం ప్రభుత్వ సర్వేయర్ మేహేశ్ 11 మంది సర్వేయర్లకు పట్టా ల్యాండ్ సర్వే నంబర్, డిమార్కేషన్, మోకా పంచనామా రిపోర్టు తయారీపై శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి అక్టోబర్ 3వ తేదీన అసెస్‌మెంట్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఉత్తీర్ణత సాధించిన వారికి ప్రభుత్వం లైసెన్స్ ఇవ్వనుంది. ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ బాబు, లైసెన్సడ్ సర్వేయర్లు పాల్గొన్నారు.