
నేడు విశ్వకర్మ జయంతి
తాండూరు రూరల్: మండలంలోని ఖాంజాపూర్ గుట్ట వద్ద బుధవారం విరాట్ విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహించనున్నట్లు విశ్వబ్రాహ్మణలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం ప్రత్యేక పూజలు, యజ్ఞం వంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి హాజరు కానున్నట్లు తెలిపారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ లలితాదేవి
అనంతగిరి: స్వస్థ్ నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా మహిళల ఆరోగ్య పరిరక్షణ కొరకు హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ లలితాదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం వికారాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శిబిరం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి స్పీకర్ ప్రసాద్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ క్యాంపులో చిన్నపిల్లలు, యుక్త వయస్సు బాలికలు, అన్ని వయస్సు మహిళలకు వైద్య పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని మహిళలు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వికారాబాద్‌లో నిర్వహించే మెగా వైద్య శిబిరంతో పాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి రోజూ 8 హెల్త్ క్యాంపులు 12 రోజులపాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
డీఏఓ రాజరత్నం
నవాబుపేట: జిల్లాలో సాగుకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని డీఏఓ రాజరత్నం తెలిపారు. మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ప్రస్తుత అవసరాల మేరకు అందుబాటులో ఉందన్నారు. 4.200 లీటర్ల నానో యూరియా సిద్ధంగా ఉందని తెలిపారు. నానో యూరియా వల్ల ఎంతో మేలన్నారు. కార్యక్రమంలో ఏవో జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి: వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మంగళవారం బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావును హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా రాజకీయాలు, పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను వారికి ఆనంద్ వివరించినట్లు తెలిసింది.
కొందుర్గు: విద్యార్థులు చదువులో మరింత రా ణించేలా ఉపాధ్యాయులు కృషిచేయాలని రాష్ట్ర విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ లింగయ్య సూ చించారు. విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో అమలు తీరును పరిశీలించడంలో భాగంగా మంగళవారం కొందుర్గు జిల్లా పరిషత్ ఉన్నత పాఠ శాల, చౌదరిగూడ ప్రాథమిక, ఉన్నత పాఠ శాల, చౌదరిగూడ కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలను సందర్శించారు. ఆయా పాఠశాలల్లో మౌలిక వసతులు, పరిసరాల పరిశుభ్ర త, మధ్యాహ్న భోజనం అమలుతీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సివిల్ వర్క్స్, యూడైస్ పీఎం పోషణ్ తదితర అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త విద్యార్థుల నమోదు, విద్యార్థులు, ఉపాధ్యాయుల ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్‌ను పరిశీలించారు. చౌదరిగూడ పాఠశాలలో విద్యార్థులతోపాటు తరగతి గదిలో కూర్చొని ఉపాధ్యాయుల బోధనను పరిశీలించారు.

నేడు విశ్వకర్మ జయంతి