ఉరేసుకుందా.. గుండెపోటా? | - | Sakshi
Sakshi News home page

ఉరేసుకుందా.. గుండెపోటా?.. తల్లిదండ్రుల పొంతన లేని సమాధానాలు

Aug 29 2023 2:50 AM | Updated on Aug 29 2023 7:45 AM

- - Sakshi

వికారాబాద్‌ పరిధిలో ఇంటర్‌ విద్యార్థిని అనుమానాస్పద మృతి కేసులో.. 

వికారాబాద్: ఇంటర్‌ విద్యార్థిని మృతి అనుమానాస్పదంగా మారింది. ఉరేసుకుని మృతిచెందినట్లు గ్రామస్తులు చెబుతుండగా.. తమ బిడ్డ గుండె పోటుతో మృతిచెందిందని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని నాగారం గ్రామానికి చెందిన అపూర్వ (18) రంగారెడ్డి జిల్లా షాబాద్‌లోని ఓ గురుకుల కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

వారం రోజుల క్రితం కంటి నొప్పితో హాస్టల్‌ నుంచి ఇంటికి వచ్చింది. తండ్రి బైండ్ల వెంకటయ్యకు ఫోన్‌ చేసిన ప్రిన్సిపల్‌ బాలికను పంపించాలని సూచించారు. దీంతో తల్లిదండ్రులు అపూర్వకు విషయం చెప్పి హాస్టల్‌కు వెళ్లమని సూచించారు. ఆమె మాత్రం రాఖీ పౌర్ణిమ తర్వాత వెళతానని చెప్పడంతో చిన్నపాటి వాగ్వాదం జరిగింది. మిన్నకుండిపోయిన తల్లిదండ్రులు ఎవరి పనులపై వారు వెళ్లిపోయారు.

తమ్ముడు సైతం ఇంట్లో లేకపోవడంతో ఒంటరిగా ఉన్న అపూర్వ చీరతో ఫ్యా న్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లగా.. తమ కూతురు గుండెపో టు తో మృతి చెందిందని తల్లిదండ్రులు చెప్పారు. ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు నిరాకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement