బీసీని ప్రధానిని చేసిన ఘనత బీజేపీదే : ఆర్‌ కృష్ణయ్య

BC Become PM That Credit Goest to BJP  - Sakshi

హైదరాబాద్‌(గన్‌పార్క్‌): కేంద్రం ఓబీసీ కుల గణన చేపట్టేలా అసెంబ్లీ లో తీర్మానం చేస్తామని ప్రకటించింనందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటికే పక్క రాష్ట్రాలలైన తమిళనాడు, కేరళ బీసీ జనగణన చేపడుతున్నాయని ఇక ఇతర రాష్ట్రాల్లో కూడా బీసీ జన గణన జరిగేలా చూడాలంటూ... కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు బీసీని ప్రధానిని చేసిన ఘనత బీజేపీ ప్రభత్వానిదేనంటూ ప్రశంసించారు.

(చదవండి: తెలుగు అకాడమీ కేసులో పద్మనాభన్‌ అరెస్టు)

అంతేకాదు బీసీ కమిషన్లు, సుప్రీం కోర్టు జన గణన చేపట్టాలని ఒత్తిడి తెచ్చారని తెలిపారు కృష్ణయ్య. అయితే  జన గణనలో కుల గణన వచ్చినప్పుడే  బీసీలకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మన దేశంలో వెనుకబడిన కులాలు 46 లక్షల కులాలున్నాయి అని కేంద్రం తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. అంతేకాదు వెనుకబడిన కులాలు  6 వేల వున్నాయని, అందులో బీసీలు 2 వేల కులాలే ఉన్నాయని చెప్పారు. అంతేకాదు గతంలో 2014లో సకల జనుల సమగ్ర కుటుంబ సర్వే.. చేయించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పైగా దానికి చట్టబద్ధత లేదంటూ చెబుతున్నారంటూ ఆరోపించారు. ఈ మేరకు చట్టబద్ధత వున్న సంస్థలతో సర్వే చేయించకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు.
(చదవండి: తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా)

Read latest TS Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top