బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత

Oct 12 2026 8:16 AM | Updated on Oct 12 2026 8:16 AM

తిరుమల : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. సోమవారం నుంచి 20వ తేదీ వరకు జరిగే ఉత్సవాల బందోబస్తు కోసం 2,800 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు వెల్లడించారు. ఆదివారం తిరుమల పోలీసు కంట్రోల్‌ రూమ్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ భక్తుల రద్దీ నియంత్రణ, ట్రాఫిక్‌ నిర్వహణ, భద్రతా చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ నెల 16న గరుడసేవ, 17న పుష్పకవిమానం, 19న స్వర్ణరథం, 20న చక్రస్నానం సందర్భంగా ప్రత్యేక భద్రత కల్పించాలని ఆదేశించారు. మాడ వీధులు, గ్యాలరీలు, ఘాట్‌ రోడ్లు, పార్కింగ్‌ ప్రాంతాలు, ప్రధాన రాకపోకల మార్గాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బారికేడ్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేసి అవసరమైన చోట ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టాలని తెలిపారు.

సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా

భద్రతా పర్యవేక్షణ కోసం ప్రత్యేక పోలీసు కంట్రోల్‌ రూమ్‌, సబ్‌ కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశామని ఎస్పీ వెల్లడించారు. సీసీటీవీ కెమెరాలు, బాడీ వార్న్‌ కెమెరాలు, రియల్‌ టైమ్‌ మానిటరింగ్‌ వ్యవస్థ ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. తిరుపతి నగరంలో డ్రోన్ల ద్వారా కూడా పరిస్థితులను పరిశీలించనున్నట్లు వివరించారు. సోషల్‌ మీడియాలో ప్రచారమయ్యే సమాచారంపై నిఘా ఉంచడంతో పాటు అత్యవసర సమయంలో వేగంగా స్పందించేందుకు ప్రత్యేక జాయింట్‌ యాక్షన్‌ టీమ్‌లను సిద్ధం చేశామన్నారు.

భక్తులకు ‘మే ఐ హెల్ప్‌ యూ’

భక్తులకు మెరుగైన సేవలందించేందుకు ‘మే ఐ హె ల్ప్‌ యూ’ టీషర్టులు ధరించిన ప్రత్యేక పోలీసు బృందాలను అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. ఈ సిబ్బంది నాలుగు మాడ వీధులకే పరిమితం కాకుండా తిరుమలవ్యాప్తంగా భక్తులకు మార్గదర్శనం, సహాయ సహకారాలు అందించనున్నట్లు వెల్ల డించా. దర్శన మార్గాలు, క్యూలు, వసతి గృహాలు తదితర అంశాలపై ఏదైనా సహాయం అవసరమైతే వారిని సంప్రదించవచ్చని ఎస్పీ తెలిపారు. ప్రతి భక్తుడికి సురక్షితమైన, ప్రశాంతమైన దర్శన అనుభూతిని కల్పించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని ఎస్పీ స్పష్టం చేశారు. పోలీసు సిబ్బంది సమన్వయంతో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, భక్తులతో మర్యాదగా వ్యవహరిస్తూ వారికి అవసరమైన సహాయం అందించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement