ఉన్నత విద్యకు ఉరి | - | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్యకు ఉరి

Oct 11 2026 1:22 PM | Updated on Oct 11 2026 1:22 PM

కూటమి పాలనలో ఉన్నత విద్య అస్తవ్యస్తం జిల్లాలో దారుణంగా పడిపోయిన పీజీ, యూజీ ప్రవేశాలు విద్యా సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు గడుస్తున్నా పూర్తికాని అడ్మిషన్ల ప్రక్రియ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎగవేతతో దిగజారిన అడ్మిషన్లు ప్రభుత్వ తీరుపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల మండిపాటు

తిరుపతి సిటీ: కూటమి పాలనలో విద్యారంగం అస్తవ్యస్తంగా మారింది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలు భారీ స్థాయిలో పడిపోయాయి. ఐసెట్‌, లాసెట్‌, పీజీసెట్‌, ఎడ్‌సెట్‌, ఈఏపీసెట్‌ పరీక్షలు జరిగి ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటికీ ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయలేదంటే ప్రభుత్వ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే డిగ్రీ ప్రవేశాలు సైతం తొలి విడత మాత్రమే పూర్తి చేశారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ, పీజీ ప్రవేశాలు కనీసం 45 శాతం దాటకపోడం గమనార్హం.

తగ్గిన ప్రవేశాలు

గత రెండేళ్ల నుంచి జిల్లాలోని యూజీ కోర్సులు నడుపుతున్న కళాశాలలకు సుమారు 9 విడతల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాల్సి ఉంది. 2026–27 విద్యా సంవత్సరంలో బీటెక్‌, లా, బీఈడీ, టెక్నికల్‌, సాధారణ యూజీ కోర్సుల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్‌ ప్రస్తావన తీసుకురావద్దంటూ ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు తేల్చిచెబుతున్నాయి. కోర్సుకు సంబంధించి పూర్తి ఫీజు ఒకే సారి చెల్లిస్తేనే అడ్మిషన్‌ ఇస్తామంటూ హుకుం జారీ చేస్తున్నారు. దీంతో గ్రామీణ పేద, బడగుబలహీన వర్గాలు విద్యకు దూరమవుతున్నారు.

పరీక్షలు జరగాల్సిన సమయం...

ప్రవేశాలు పూర్తికాని వైనం

జూన్‌, జూలై మాసం చివరికి అన్ని పీజీ, యూజీ అడ్మిషన్లు పూర్తి చేసి, నవంబర్‌లో తొలి సెమిస్టర్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ రెండేళ్లుగా ఇందుకు విరుద్ధంగా అక్టోబర్‌, నవంబర్‌ ఫస్ట్‌ వీక్‌ వరకు ప్రవేశాల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. తొలి సెమిస్టర్‌ పరీక్ష జనవరి చివరిలో నిర్వహించి, రెండవ సెమిస్టర్‌ పరీక్షను వచ్చే విద్యాసంవత్సరంలో నిర్వహిస్తూ విద్యార్థులను మాససిక ఒత్తిడికి గురిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement