బ్రేక్‌డౌన్‌ రహిత సేవలే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

బ్రేక్‌డౌన్‌ రహిత సేవలే లక్ష్యం

Oct 11 2026 1:22 PM | Updated on Oct 11 2026 1:22 PM

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: బ్రహ్మోత్సవాల రవాణా ఆపరేషన్లను విజయవంతం చేయాలని ఏపీపీటీడీ కడప జోన్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ కిషోర్‌ సూచించారు. శనివారం ఆయన అలిపిరి బాలజీ బస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన బేస్‌ క్యాంపును తనిఖీ చేశారు. బేస్‌ క్యాంప్‌లో ఇప్పటివరకు నమోదైన వాహన లోపాలు, వాటిని సరిదిద్దడంలో సాధించిన పురోగతిపై ఆరా తీశారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల వేళ, ఘాట్‌ రోడ్లపై ప్రయాణించే ప్రతి బస్సు వంద శాతం ఫిట్‌నెస్‌తో ఉండాలని సాంకేతిక విభాగ అధికార సిబ్బందిని ఆదేశించారు. తిరుమల కొండపైకి ప్రయాణించే భక్తులకు అత్యంత సురక్షితమైన, బ్రేక్‌డౌన్‌ రహిత రవాణా సేవలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. డీపీటీవో శ్రీనివాసరావు, డిప్యూటీ సీటీఎం విశ్వనాథ్‌, డిప్యూటీ సీఎంఈ బాలాజీ, పుత్తూరు డిపో మేనేజర్‌ మహేంద్ర, ఏఈ జగదీష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement