జనాభా ప్రాతిపదికన స్థానిక రిజర్వేషన్లు | - | Sakshi
Sakshi News home page

జనాభా ప్రాతిపదికన స్థానిక రిజర్వేషన్లు

Oct 11 2026 1:22 PM | Updated on Oct 11 2026 1:22 PM

తిరుపతి అర్బన్‌: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రిజర్వేషన్ల కేటాయింపుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోవిందరావు సూచించారు. శనివారం ఆయన కలెక్టరేట్‌లో అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ 2011 జనాభ లెక్కప ప్రకారమే రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టాలన్నారు. అయితే తొలి ప్రాధాన్యత అధిక జనాభా ఉన్న సామాజిక వర్గానికి ఇవ్వాలన్నారు. అలాగే జనాభాతోపాటు ఓటర్లు, అనుబంధ పట్టికలను (గత రిజర్వేషన్లు) పరిగణనలోకి తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ సిద్ధం చేయాలన్నారు. సర్పంచ్‌లు, వార్డులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల రిజర్వేషన్‌ వ్యవహారం కలెక్టర్‌ పర్యావేక్షణలో ఉంటుందని స్పష్టం చేశారు. సమావేశంలో డీపీవో సుశీలాదేవి, తిరుపతి, సూళ్లూరుపేట ఆర్డీవోలు రామ్మోహన్‌, దేవేందర్‌రెడి, జెడ్పీ డిప్యూటీ సీఈవో వెంకటనారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement