శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలో రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అండర్–14, అండర్–17, అండర్–19 విభాగాల రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి తిరుపతి డీఈఓ కె.వి.ఎన్.కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి క్రీడాకారులనుద్దేశించి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి అండర్–14, 17, 19 విభాగాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. విక్రమ్ చెన్నిస్ అకాడమీ ఫౌండర్ డాక్టర్ జీ.చంద్రశేఖర్, ఎస్‌జీఎఫ్ సెక్రటరీలు సాంబశివరావు, అమ్ములు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కిషోర్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు


