కబ్జాకోరుపై చర్యలు తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

కబ్జాకోరుపై చర్యలు తీసుకోండి

Oct 7 2026 12:29 AM | Updated on Oct 7 2026 12:29 AM

● మీడియా ఎదుట వృద్ధురాలి ఆవేదన

చంద్రగిరి : విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని, వాటికి నకిలీ పత్రాలను సృష్టించి కబ్జాలకు పాల్పతున్న భూ ఆక్రమణదారుడిపై చర్యలు తీసుకోవాలంటూ చంద్రగిరి మండలం, గంగడుపల్లికి చెందిన వృద్ధురాలు బంగారమ్మ ఆరోపించారు. అదే పంచాయతీకి చెందిన కేపీ.గంగిరెడ్డి, అతని కుమారుడు హరికిషన్‌లు ప్రభుత్వం భూములతోపాటు తమ భూములను సైతం ఆక్రమించుకుని తమపైనే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నాడని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. గండుగుపల్లికి చెందిన కేపీ.గంగిరెడ్డి దొంగ రికార్డులను సృష్టించి అధికారులను సైతం బురిడీ కొట్టిస్తున్నాడని బాధితురాలు ఆరోపించారు. దోర్నకంబాల లెక్కదాఖల సర్వే నం.365/8, 369/19, 365/11, 365/22లోని సుమారు 12 ఎకరాలకు పైగా గుట్ట, వాగు పోరంబోకులను ఆక్రమించుకుని ఫెన్సింగ్‌ వేసుకున్నట్లు తెలిపారు. దీనికి తోడు తన కుమారుడికు చెందిన సర్వే నం.365/18లోని 43 సెంట్లను గంగిరెడ్డి ఆక్రమించుకున్నాడని, ఇదేమిటని అడిగితే తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నట్లుగా వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణ విషయమై ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నాడని వాపోయారు. సంబంధిత జిల్లా అధికారులు స్పందించి దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆమె కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement